Jump to content

మొదటి పేజీ

వికీపీడియా నుండి
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,19,221 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
అయ్యదేవర కాళేశ్వరరావు

అయ్యదేవర కాళేశ్వరరావు (జనవరి 22, 1881 - ఫిబ్రవరి 26, 1962) స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మొదటి శాసనసభాధిపతి. కృష్ణా జిల్లా, నందిగామలో జన్మించిన ఈయన బందరులోని నోబుల్ కళాశాలలో బి.ఎ చదివాడు. కొద్ది రోజులు ఉపాధ్యాయుడిగా పనిచేశాక మద్రాసు వెళ్ళి బి.ఎల్ చదివి న్యాయవాది అయ్యాడు. జమీందారీ చట్టం మీద అవగాహన పెంచుకుని అనేక జమీందార్లకు న్యాయవాదిగా పనిచేశాడు. గాంధీజీ సలహా మేరకు న్యాయవాద వృత్తిని త్యజించి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. మొదటగా బ్రహ్మసమాజ కార్యక్రమాలలో పాల్గొన్నాడు. బెంగాల్ విభజనకు వ్యతిరేక ఉద్యమంలోనూ, హోంరూల్ ఉద్యమంలోనూ పాల్గొని కొంతకాలం జైలు శిక్ష కూడా అనుభవించాడు. సంఘ సంస్కరణలో భాగంగా అస్పృశ్యతా నిర్మూలనకు కృషి చేశాడు. గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొని అనేక పుస్తకాలు కూడా రచించాడు. 1926, 1937, 1946, 1955 సంవత్సరాలలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో విజయవాడకు ప్రాతినిథ్యం వహించాడు. విజయవాడ పురపాలక సంఘ అధ్యక్షుడిగానూ, మద్రాసు శాసనసభకు చీఫ్ విప్‌గానూ బాధ్యతలు నిర్వర్తించాడు. స్వాతంత్ర్యానంతరం 1955లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయవాడ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎన్నికై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి శాసనసభకు ఈయన తొలి సభాపతిగా ఎన్నికయ్యాడు. 1956 నుండి 1962 వరకు రాష్ట్ర శాసనసభ సభాపతిగా బాధ్యతలు నిర్వర్తించాడు. 1962లో శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు, కానీ ఫలితాలు వెలువడడానికి ముందురోజే తుదిశ్వాస వదిలాడు. ఇతని జీవిత చరిత్ర నవ్యాంధ్రము నా జీవిత కథ అనే పుస్తక రూపంలో వెలువడింది. విజయవాడలో కాళేశ్వరరావు మార్కెట్ ఇతని పేరు మీదుగా నిర్మించారు.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... హైదరాబాదు రాజ్యంలో పత్రికలపై ఆంక్షలు విధించేందుకు ఎకరార్ నామా అనే నిబంధన ప్రవేశపెట్టారనీ!
  • ... సంగీత దర్శకుడు రాహుల్ రాజ్ ప్రతిష్టాత్మక బర్కిలీ సంగీతకళాశాల పూర్వ విద్యార్థి అనీ!
  • ... పిల్లలకోసం ప్రత్యేకంగా వెలువడిన తొలిపత్రిక బాలమిత్ర అనీ!
  • ... బుచ్చిబాబు సానా రూపొందించిన మొదటి చిత్రం ఉప్పెన, జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకుందనీ!
  • ... కొండవీటి వాగు కొండవీటి కొండల్లో ఉద్భవించి కృష్ణానదిలో కలుస్తుందనీ!
చరిత్రలో ఈ రోజు
జనవరి 23:



మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.